కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా

Manish Sisodia Says Bharat Biotech Refused To Supply Covaxin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి కోవాక్జిన్‌ టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ నిరాకరించిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని సరఫరాను నిలిపివేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, మరలా 6.6 కోట్ల వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు.

వ్యాక్సిన్‌ల సరఫరా లేకపోవడంతో 17 పాఠశాలల్లోని 100 కోవాక్జిన్‌ సెంటర్లను మూసివేయాల్సి వస్తుందని ట్విట్టలో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం  కోవాక్జిన్‌-భారత్‌ బయోటెక్‌, కొవిషీల్డ్‌- సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాను కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13.5 లక్షల కేసులు నమోదు కాగా..12.4 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 20,010 మంది మరణించారు.
(చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top