ఎర్రకోట ఘటన: ‘మోస్ట్ వాంటెడ్‌’ అరెస్టు!

Man wanted in Red Fort violence arrested from Punjab - Sakshi

న్యూఢిల్లీ: ఎర్రకోట హింసాత్మక ట్రాక్టర్‌ ర్యాలీ ఘటనలో ప్రధాన నిందితుడు దీప్‌ సిధ్దూని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ కర్నాల్‌లో ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. తాజాగా ఇదే ఘటనకు సంబంధించి మరో నిందితుడు ఇక్బాల్‌సింగ్‌ను హౌషియాపూర్‌ పంజాబ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  కాగా, వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం నాడు రైతన్నలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో కదం తొక్కారు. ఆక్రమంలోనే కొందరు పోలీసులను దాటుకుని వెళ్లి ఎర్రకోటపై ఖలీస్తాని జెండా ఎగురవేశారు. 

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దేశ ఖ్యాతిని పలుచన చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు బయటి వ్యక్తులు రైతులను రెచ్చగొట్టి ర్యాలీ హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారని పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఎర్రకోట ఘర్షణల నిందితుడు ఇక్బాల్‌సింగ్‌పై ఇప్పటికే  50వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. అతన్ని పోలీసులు ‘మోస్ట్ వాంటెడ్‌’ గా పేర్కొనడం గమనార్హం. ఇదిలాఉండగా.. మరో నిందితుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గత ఆదివారం పట్టుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top