భారత్‌ చేరిన మరో ఎల్పీజీ నౌక | LPG cargo ship from US arrives at Karnataka | Sakshi
Sakshi News home page

భారత్‌ చేరిన మరో ఎల్పీజీ నౌక

Mar 23 2026 7:27 AM | Updated on Mar 23 2026 7:28 AM

LPG cargo ship from US arrives at Karnataka

మంగళూరు(కర్ణాటక): పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో భారత్‌లో ఎల్పీజీ కష్టాలు పెరగడంతో ఆ సమస్యను తీర్చేందుకు అమెరికా ముందుకొచి్చంది. అమెరికా నుంచి 16,714 మెట్రిక్‌ టన్నుల ఎలీ్పజీతో బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘పైక్సిస్‌ పయనీర్‌’ ఆదివారం భారత్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన టెక్సాస్‌ రాష్ట్రంలోని పోర్ట్‌ ఆఫ్‌ నెదర్లాండ్‌ నుంచి బయల్దేరి పయనీర్‌ నౌక ఆదివారం న్యూ మంగళూరులోని నౌకాశ్రయానికి చేరుకుంది. మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ ప్లాంట్‌ సమీపంలో భారత్‌ అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక్కడ 80 వేల మెట్రిక్‌ టన్నుల ద్రవరూప పెట్రోలియంగ్యాస్‌(ఎల్పీజీ)ను భద్రపరచవచ్చు. వ్యూహాత్మక అవసరాలకు ఈ నిల్వలు అక్కరకొస్తాయి.   

రష్యా చమురు నౌక ఆగమనం  
మంగళూరు: చైనాకు వెళ్లాల్సిన రష్యా నౌక ఆక్వా టైటాన్‌ దిశమార్చుకుని మంగళూరుకు చేరుకుంది. చైనాకు బదులుగా భారత్‌ దిశగా బయల్దేరిన ఏడు నౌకల్లో ఇండియాకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. పశి్చమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సముద్రమార్గంలో చమురు రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నంకావడంతో తాత్కాలికంగా రష్యా నుంచి భారత్‌ చమురుకొనేందుకు అమెరికా అనుమతి మంజూరుచేసింది. దీంతో చైనాకు వెళ్లే ముడిచమురు నౌకలను సైతం భారత్‌ ఆగమేఘాల మీద కొనేసింది. దీంతో చైనాలోని రిజావూ పోర్ట్‌కు వెళ్లాల్సిన ఆ నౌకలు మార్చి నెల భారత్‌ వైపు దిశమార్చుకున్నాయి. జనవరి చివర్లో బాల్టిక్‌ సముద్రంలో సరుకు నింపుకున్న ఆక్వా టైటాన్‌ చివరకు భారత్‌కు చేరుకుంది. మార్చి 25వ తేదీన మరో రష్యా చమురునౌక సూయిజ్‌మ్యాక్స్‌ జౌజౌ సైతం త్వరలో భారత్‌కు చేరుకోనుంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement