ఆ చట్టాన్ని కొనసాగించాల్సిందే..అదే భారతదేశ ఐక్యతను కాపాడుతోంది!

Law Commission Said Sedition Law Protect Indias Unity - Sakshi

రాజద్రోహం చట్టం గురించి లాకమిషన్‌ ఒక ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్‌ ఇస్తే సరిపోతుందని లా కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికలో సూచనలిచ్చింది. ఆ చట్టమే భారతదేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఉపకరిస్తోంది, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేగాదు రాజద్రోహం కేసులో విధించే జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కమిషన్‌ నివేదికలో ప్రభుత్వాన్ని సూచించింది కూడా.

రాజద్రోహం చట్టాన్ని సవాల్‌ చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లపై అభిప్రాయన్ని చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నేపథ్యంలో ఈ నివేదికి రావడం గమనార్హం. వలసవాద వారసత్వంగా ఉన్న రాజద్రోహం రద్దుకు సరైన కారణం లేదని జస్టిస్‌ రీతు రాజ్‌ అవస్తీ(రిటైర్డ్‌​) నేతృత్వంలోని లా కమిషన్‌ పేర్కొంది. ఈ చట్టాన్ని తరుచు వలసవాద వారసత్వంగా చెబుతుంటారు. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా ఉపయోగించిన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

వాస్తవానికి  న్యాయవ్యవస్థ మొత్తం వలసవాద వారసత్వమే అని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే సెక్షన్‌ 124ఏ దుర్వినియోగంపై అభిప్రాయాలను స్వీకరించామని, వాటిని అరికట్టేలా మోడల్‌ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయాలని సిఫార్సు చేస్తున్నామని నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్‌ 124ఏకి కింద నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు.. క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ 1973 సీర్పీసీ సెక్షన్‌ 196(3)కి సమానమైన సీర్పీసీ 154 సెక్షన్‌ని ఒక నిబంధనగా ప్రత్యామ్నాయంగా చేర్చవచ్చని సూచించింది.

ఇది అవసరమైన విధానపరమైన భద్రతను అందిస్తుంది అని లా కమిషన్‌ చైర్మన్‌ అవస్తీ.. న్యాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కు తన నివేదికలో తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపా చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాలు ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద సూచించబడిన నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్‌ చేయదని అందువల్ల రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్‌ నొక్కి చెప్పింది.

ఇదిలా ఉండగా దేశద్రోహ చట్టం హేతుబద్ధతను పునఃపరిశీలిస్తామని చెబుతూ కేంద్రం అఫడవిట్‌ దాఖలు చేయమడే గాక రాజ్యంగ చెల్లుబాటును నిర్ధారించే కసరత్తును వాయిదావేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు వలస రాజ్యాల కాలం నాటి నిబంధననను గట్టిగా సమర్థించడం తోపాటు దానిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేయాలని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఈ చట్టాన్ని పునఃపరిశీలించేందుకు అంగీకరించింది.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక తాజా పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, గతేడాది దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాది కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వలసరాజ్యల యుగం నాటి చట్టం గురించి ప్రస్తావించారు. ఆ చట్ట ప్రయోజనాన్ని మించి పోయి ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు. 

కాగా, బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం  చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్‌ సహా మొత్తం 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.  దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.

(చదవండి: ఐక్య ప్రతిపక్షం ఒంటరిగా బీజేపీని మట్టికరిపిస్తుంది: రాహుల్‌ గాంధీ)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top