బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.
Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb
— NDTV (@ndtv) October 25, 2025


