ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ మధ్య తలెత్తిన వివాదం తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి ఆయన కుమారుడికి క్యాబినేట్‌లోచోటు కల్పించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య పదవి మార్పుపై ఒప్పందం జరిగినట్లు కథనాలు వచ్చాయి. గతేడాది డిసెంబర్‌తో రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి కావడంతో సీఎం కుర్చీపై వార్ మెుదలైంది. డీకే శివకూమార్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదిలేదని ప్రకటించడంతో మెుత్తానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు కథనాలు వస్తున్నాయి
కేసీ వేణుగోపాల్ కామెంట్స్
అయితే ఈరోజు (మంగళవారం) సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ ఊహగానాలేనని తెలిపారు. రాజ్యసభ , కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించామని, ఇవి కాక మరే విషయాలపైనా చర్చించలేదని చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా ఉన్నారు. ఇంతలోనే సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.


