
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మంగళవారం తన వారసుడు సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం అతని అపార అనుభవంతో మరింత కీర్తిని పొందుతుందని భావిస్తున్నానని అన్నారు. గత జూలైలో రాజీనామా చేసిన తర్వాత జగదీప్ ధన్‌ఖడ్ చేసిన తొలి బహిరంగ ప్రకటన ఇదే కావడం గమనార్హం.
Former Vice President Jagdeep Dhankhar greets his successor CP Radhakrishnan. pic.twitter.com/m6WorHvNWJ
— Press Trust of India (@PTI_News) September 9, 2025
మంగళవారం ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందగా, ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు జగదీప్ ధన్‌ఖడ్ రాసిన లేఖలో ‘మీరు ఈ గౌరవనీయమైన పదవికి ఎదగడం అనేది మన దేశ ప్రతినిధుల అపార నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్‌కున్న అపారమైన అనుభవానికి తోడు ఆయన నాయకత్వంలో ఈ కార్యాలయం ఖచ్చితంగా గొప్ప గౌరవాన్ని, కీర్తిని పొందుతుందని’ అన్నారు. జగదీప్ ధన్‌ఖడ్ జూలై 21న తన అనారోగ్య సమస్యలను కారణంగా చూపుతూ, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి.