Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో భారత వైమానిక దళ విన్యాసం

Indian Air Force Conduct air show in Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని దాల్‌ సరస్స వద్ద భారత వైమాని దళం(ఐఏఎఫ్‌) 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఎయిర్‌ షో (వైమానిక విన్యాసం) నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా  ఈ వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది.ఈ విన్యాసాల కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ‘మీ కలలకు రెక్కలు ఇవ్వండి’ అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ భారత వైమానిక చరిత్ర, ప్రాముఖ్యతను యువతకు తెలియజేసే విధంగా ఉంది.

చదవండి: (ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్‌ ఇంకా మరెన్నో..)

భారత వైమానిక దళం పట్ల యువత ఆసక్తి  కలిగించడంతోపాటు జాతీయభావం పట్ల స్ఫూర్తి కలిగించడమే ఉద్దేశ్యంగా ఈ 'ఎయిర్‌ షో'ను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రదర్శనలో రకరకాల వైమానిక విన్యాసాల తోపాటు స్కై డైవింగ్‌ కూడా నిర్వహించారు.

(చదవండి: జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top