చిరుత నవ్వింది! | Sakshi
Sakshi News home page

చిరుత నవ్వింది!

Published Sun, Mar 3 2024 5:02 AM

India leopard population increased by 8percent from 12,852 in 2018 to 13,874 - Sakshi

8% పెరిగిన చిరుతల సంఖ్య

12,852 నుంచి 13,874కు పెరుగుదల 

తాజా నివేదికలో వెల్లడించిన కేంద్రం

మధ్యప్రదేశ్‌లో అత్యధిక పెరగుదల

తెలంగాణ తదితర రాష్ట్రాల్లో తగ్గుదల

చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది.

2018లో భారత్‌లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది.

ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే అభిప్రాయపడ్డారు.
 

సంఖ్య పెరిగినా...
► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి.
► మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది.
► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది.
► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది.
► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి.
 

సర్వే ఇలా...
► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు.
► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది.
► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.
► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు.
► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు
► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్‌ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది.
► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు.
► ఆ లెక్కన భారత్‌లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది.

విశేషాలు ఇవీ...
మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్‌ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం!

– సాక్షి, నేషనల్‌డెస్క్‌

Advertisement
Advertisement