నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు.. మోడల్‌ను చేస్తా..! | Hubballi Gym Trainer Love Jihad Cas | Sakshi
Sakshi News home page

నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు.. మోడల్‌ను చేస్తా..!

Apr 5 2026 11:31 AM | Updated on Apr 5 2026 1:25 PM

Hubballi Gym Trainer Love Jihad Cas

కర్ణాటక: నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు, నిన్ను పెద్ద మోడల్‌ను చేస్తాను అని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు, గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్‌ చేయించాడు. లైంగిక దాడి వీడియోలను తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు అంటూ ఓ యువతి, జిమ్‌ ట్రైనర్‌గా పనిచేసే యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుబ్లీ నగరంలో ఇది మతం రంగు పులుముకుని లవ్‌ జిహాద్‌గా రూపాంతరం చెందింది. హిందు సంఘాల నాయకులు నిందితున్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించడం, దీంతో యువతి ఇంటిపై యువకుని కుటుంబీకులు దాడులు చేయడంతో శాంతిభద్రతల సమస్య నెలకొంది.   

స్నేహితురాలి సోదరుని జిమ్‌...   
ఈ వ్యవహారం పాత హుబ్లీ ఠాణా పరిధిలో సంచలనం కలిగిస్తోంది. వివరాలు.. కాలేజీలో చదివే బాధిత యువతి (20) స్నేహితురాలి సోదరుడు జిమ్‌ నడుపుతున్నాడు. స్నేహితురాలి సూచన మేరకు తాను జిమ్‌లో మూడేళ్ల కిందట చేరినట్లు యువతి తెలిపింది. ఈ క్రమంలో నిందితుడు సమీర్‌తో తనకు మాయమాటలు చెప్పి ప్రేమ నాటకం ఆడినట్లుగా బాధితురాలి పేర్కొంది. ఒక రోజు ఇంటికి పిలిపించుకొని మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి లైంగిక దౌర్జన్యం చేశాడు. సదరు దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేసుకున్నాడు. అంతేగాక ఆ దృశ్యాలను చూపెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తు తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది. తననే కాకుండా ఎందరినో ఇదేరీతిలో మోసగించాడని కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో యువతి బంధువులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం పట్టలేక సమీర్‌ ఇంటికి వెళ్లి అతన్ని చితకబాది స్థానిక ఠాణాలో అప్పగించారు.   

ఆ ఆరోపణలు అబద్ధం..  
సమీర్‌ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యువతి, అతడు ప్రేమించుకుంటున్నారని, ఆరోపణలన్నీ అబద్ధమని చెప్పారు. తమపై దాడి జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ శశికుమార్‌ స్పందిస్తూ ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. 

హిందూ యువతులు జాగ్రత్తగా ఉండాలని, ప్రేమ పేరుతో లైంగిక సంబం«ధం పెట్టుకొని మోసగిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు, ఆమె బంధువులు చెప్పారు. సమీర్‌ కుటుంబీకులు తమ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో పాటు చంపేస్తామని బెదిరించారని యువతి తండ్రి చెప్పారు.  యువతీ యువకుని వీడియోలు వైరల్‌ అయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement