బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌! | Himanta Sarma Responds To Pak If China Stops Brahmaputra Water | Sakshi
Sakshi News home page

బ్రహ్మపుత్రా నదీ జలాలు చైనా ఆపేస్తే.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Jun 3 2025 8:19 PM | Updated on Jun 3 2025 9:05 PM

Himanta Sarma Responds To Pak If China Stops Brahmaputra Water

గువాహటి:  పహల్లాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో భారత్‌ అనేక చర్యలను చేపట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌ను పదే పదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో భారత్‌ పలు ఆంక్షల్ని అమలు చేసింది. అందులో పాకిస్తాన్‌ జాతీయుల్ని తక్షణమే దేశం విడిచి వెళ్లాపోవాలనే ఆంక్షలతో పాటు సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలుపుదల చేసింది.  

ఆపై ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది భారత్‌. అయితే సింధూ జలాల నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌.. సింధూ జలాలను పునరుద్ధరించాలని పదే పదే భారత్‌కు విజ్ఞప్తులతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు మిత్రదేశం చైనాను తెరపైకి తెచ్చింది పాక్‌. బ్రహ్మపుత్రా నదీ జలాలను భారత్‌కు చైనా నిలిపివేస్తే అంటూ కొత్త రాగం అందుకుంది. అసలు బ్రహ్మపుత్రా నదికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకుండానే భారత్‌ను బెదిరించాలనే యత్నం చేసింది

దీనికి భారత్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సా ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.  అసలు పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు అర్థంపర్థంలేనివిగా కొట్టిపారేశారు. అదే సమయంలో అసలు బ్రహ్మపుత్రా నదీ చైనా భూభాగంలో 30 నుంచి 35 శాతం మాత్రం ఉందని, ఇక మిగిలిని 65 శాతం నుంచి 70 శాతం భారత్‌లో ఉందన్నారు.  

బ్రహ్మపుత్రా నదీ గురించి వాస్తవ కోణంలో ఆలోచిస్తే ప్రధానంగా మంచు కరగడం, టిబెటన్ పీఠభూమిపై పరిమిత వర్షపాతం ద్వారా నదీ జలాలు పెరగడం అనేది ఉంటుందన్నారు. బ్రహ్మపుత్ర నది భారతదేశం ఎగువ ప్రవాహంపై ఆధారపడిన నది కాదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలోపేతం అవుతుంది’ అని ఆయన అన్నారు.  

చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించే అవకాశం లేదనీ, ఒకవేళ  అలా చేసినా భారత్‌కు మేలు చేసినట్లే అవుతుందన్నారు.  అస్సాంలో వరదలు కారణంగా ప్రతీ ఏడాది నిరాశ్రయులయ్యే వారు వేలలో ఉంటున్నారని హిమాంతా బిశ్వా శర్మ చమత్కరించారు.  

సాధారణంగా భారత్‌-చైనా సరిహద్దు(టుటింగ్‌)లో బ్రహ్మపుత్రా నదీ పరిమాణం సెకనుకు 2,000 నుంచి 3,000 వేల క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని,   అస్సాంలో వర్షాకాలంలో వచ్చేసరికి  15 వేల క్యూబిక్‌ల నుంచి 20 వేల క్యూబిక్‌ల ఆ నది పరిమాణం ఉంటుందన్నారు.  ఇది బ్రహ్మపుత్రా నదీ ప్రవాహంలో భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోందన్నారు.  "బ్రహ్మపుత్ర నది అనేది ఎవరో ఒకరిచే నియంత్రించబడదు అనేది పాక్‌ తెలుసుకుంటే మంచిదన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement