‘జీఎస్టీలో రాష్ట్రాల వాటా చెల్లింపుపై మెలిక’ | Govt Tells Panel It Has No Money To Pay States Their GST Share | Sakshi
Sakshi News home page

ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటనపై కలకలం

Jul 30 2020 1:41 PM | Updated on Jul 30 2020 1:43 PM

Govt Tells Panel It Has No Money To Pay States Their GST Share - Sakshi

విపక్ష సభ్యుల ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ : 2017లో జీఎస్టీ వ్యవస్ధ అమల్లోకి వచ్చిన అనంతరం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ వాటాపై తొలిసారిగా కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన వాటాపై చావుకబురు చల్లగా వినిపించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా జీఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటాను చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని అంగీకరించింది. 2019 ఆగస్ట్‌ నుంచి అంటే లాక్‌డౌన్‌కు ముందే  జీఎస్టీ వసూళ్లలో సగమే సమకూరుతున్న పరిస్ధితి. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం, లేదా పన్ను పరిధిలోకి మినహాయించిన వస్తుసేవలను తీసుకురావడంతో దీన్ని భర్తీ చేయాలని భావించారు.

ఇక జీఎస్టీ చట్టంలో పేర్కొన్న తరహాలో రెవెన్యూ షేర్‌ కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం చెల్లించే పరిస్ధితిలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే స్పష్టం చేశారు. పాండే ప్రకటనపై పార్లమెంటరీ కమిటీలోని విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ సభ్యుడు జయంత్‌ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార‍్లమెంటరీ కమిటీ ఎదుట పాండే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. చదవండి : శానిటైజర్లపై 18శాతం జీఎస్‌టీ ఎందుకంటే..?

కమిటీ తొలి భేటీకి హాజరైన కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల సభ్యులు ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటనపై మండిపడుతున్నారు. కొద్దినెలలుగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయడం లేదని ఈ సమావేశంలో విపక్ష సభ్యులు ప్రస్తావించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ పరిస్ధితుల్లో జీఎస్టీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి పాండే చేసిన ప్రకటనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement