Four Years Old Boy Falls Into Open Bore-well In UP: బోరుబావిలో పడిపోయిన బాలుడు - Sakshi
Sakshi News home page

బోరుబావిలో పడిపోయిన బాలుడు

Dec 3 2020 9:03 AM | Updated on Dec 3 2020 10:43 AM

Four yearold boy falls into open borewell in UP - Sakshi

సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి ప్రమాదం కలకలం రేపుతోంది. మహోబా జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనలో పడిపోయిన  బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్ దళాలు, ఆరోగ్య, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తూ అధికారులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ధనేంద్ర ఆడుకుంటూ సుమారు 25-30 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయాడని పోలీసు అధికారి అనుప్ కుమార్ దుబే చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో బాలుని తల్లిదండ్రులు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారని తెలిపారు. బాలుడుని కాపాడేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయనీ,  లక్నో నుంచి జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దింపామని మహోబా జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement