గుజరాత్‌లో ఐదు సింహాలు మృతి | Five lions die in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో ఐదు సింహాలు మృతి

May 27 2026 1:23 AM | Updated on May 27 2026 1:26 AM

Five lions die in Gujarat

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో విషాదం చోటు చేసుకుంది. పలు కారణాలతో ఐదు సింహాలు మృత్యువాతపడ్డాయి. ఈ వివరాలను ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ప్రకటించారు. మృతిచెందిన సింహాల్లో మూడు పెద్ద సింహాలు కాగా మరో రెండు సింహాం కూనలని  ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పేర్కొన్నారు.  

మృతిచెందిన సింహాల్లో  రెండు సహజ కారణాలతో ఒకటి మాత్రం కొట్లాటలో గాయాల పాలై చనిపోయిందని తెలిపారు. అయితే చనిపోయిన సింహాం పిల్లలు మాత్రం బబెసియా వైరస్‌ సోకి సింహం పిల్లలు చనిపోయినట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ జైపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ బబెసియా వైరస్‌ మిగతా జంతువులకు సోకే అవకాశాలు లేవన్నారు. కీటకాల కారణంగా బబేసియా సోకుతుందని, దీని వ్యాప్తిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని  వివరించారు. 

దీనిపై  సాధారణంగా వన్యప్రాణుల పిల్లలు బతికుండే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉంటాయన్నారు. జంతువుల్లో వ్యాధి నిరోధకత సహజంగా తక్కువగా ఉంటుందని, తాజా ఘటనలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. గిర్‌లో 2018లో కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్, ప్రొటోజోవల్‌ ఇన్ఫెక్షన్‌లకు గురై నెల వ్యవధిలోనే 11 సింహాలు మృత్యువాతపడ్డాయి. 2025 గణాంకాల ప్రకారం గుజరాత్‌లో 891 ఆసియాటిక్‌ సింహాలున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement