తొలి రోజు తీహార్‌ జైలులో కేజ్రీవాల్‌ కష్టాలు.. పడిపోయిన షుగర్‌ లెవెల్స్‌

First Day kejriwal Spent Sleepless Night In Tihar Jail  - Sakshi

న్యూఢిల్లీ:  తీహార్‌ జైలులో తొలిరోజు సోమవారం (ఏప్రిల్‌ 1) రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అతి కష్టంగా గడిపినట్లు తెలిసింది.  లిక్కర్‌​ స్కామ్‌ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయనను తీహార్‌ జైలులోని ప్రిజన్‌ నెంబర్‌ 2ను కేటాయించారు. అయితే జైలులో తొలి రోజు కేజ్రీవాల్‌ సరిగా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు.  రాత్రి కొద్దిసేపు మాత్రమే కేజ్రీవాల్‌ నిద్రపోయారన్నారు.

కేజ్రీవాల్‌కు సాయంత్రం టీ ఇచ్చామని, రాత్రికి ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని కేజ్రీవాల్‌కు వడ్డించామని చెప్పారు. కేజ్రీవాల్‌ నిద్రపోయేందుకుగాను పరుపు, రెండు దిండ్లు, బ్లాంకెట్‌లు ఇచ్చారు. జైలులో తొలిరోజు సరిగా నిద్ర లేకపోవడం వల్ల కేజ్రీవాల​ షుగర్‌ లెవెల్స్‌ 50 కంటే తక్కువకు పడిపోయాయని, డాక్టర్ల సూచన మేరకు ఆయనకు మందులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. జైలులోని డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

‘మంగళవారం తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే కేజ్రీవాల్‌ కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు. టీ, రెండు బిస్కెట్లు తీసుకున్నారు. రామాయణ, మహాభారత, హౌ ప్రైమ్‌ మినిస్టర్‌ డిసైడ్‌ అనే పుస్తకాలను అడిగి తీసుకున్నారు‘ అని జైలు అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి.. లిక్కర్‌ కేసులో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు భారీ ఊరట       

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top