పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. | Sakshi
Sakshi News home page

Famous Saints: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..

Published Tue, Dec 26 2023 9:41 AM

Famous Saints of the Year 2023 - Sakshi

2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 

1. సంత్‌ ప్రేమానంద్ 
సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్‌ ప్రేమానంద్‌ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్‌ ప్రేమానంద్‌ మహరాజ్‌ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 
 
2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి
బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 

3. జయ కిషోరి 
కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్‌లో  ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 

4. సద్గురు జగ్గీ వాసుదేవ్ 
కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్‌ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్‌ యూట్యూబ్  చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 

5. శ్రీశ్రీ రవిశంకర్ 
తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక  గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 
 
6. గౌర్ గోపాల్ దాస్ 
మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్‌దాస్ ఇస్కాన్‌లో సభ్యునిగా ఉన్నారు.
 
7. పండిట్ ప్రదీప్ మిశ్రా
భోపాల్‌కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు.
 
8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ 
ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

9. వైష్ణవ్ రామ భద్రాచార్య
వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్‌డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని  పద్మభూషణ్‌తో సత్కరించింది. 
 
10. దేవకీ నందన్ ఠాకూర్ 
దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.  దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు.
ఇది కూడా చదవండి: యూజర్స్‌ అత్యధికంగా డిలీట్‌ చేసిన యాప్‌ ఏది?

Advertisement
 
Advertisement