యూపీలో సమాజం తలదించుకొనే చర్య

Elderly Woman Gets Beaten in Public by Man Video Goes Viral - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఘజియాబాద్‌ జిల్లాలో మహిళపై ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. ఆమె పైకి లేస్తుండగా కుర్చీతో ఆమెపై దాడి చేసి లేవనంతగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడే  ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో నమోదయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆవ్యక్తిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరు అతని మీద ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. 

ఇక ఈ వీడియోను చూసిన వారందరూ ఆ మహిళపై దాడి జరుగుతుంటే ఎవరు కాపాడటానికి ముందుకు రాలేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొట్టి వెళ్లిపోయిన తరువాత ఒక వ్యక్తి ఆమెకు కుర్చీ తీసుకువచ్చి సాయం చేశాడు. అయితే అప్పటి దాకా ఎవరూ ముందు వచ్చి ఆ నిస్సహాయ మహిళను ఆదుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయం అంటూ ట్వీట్‌ చేస్తున్నారు.   చదవండి: మొబైల్‌ చార్జర్‌ కేబుల్‌ మెడకు చుట్టి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top