కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులకు సులువైన, ఒత్తిడిలేని చదువు
చదువుకోవడానికి పక్కా టైంటేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. –సాక్షి స్పెషల్ డెస్క్
పోమోడోరో టెక్నిక్
గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్రకెక్కదు. అందుకే పోమోడోరో టెక్కిక్ అనే ఈ స్మార్ట్ పద్ధతిని పాటించండి.
⇒ 25 నిమిషాలు శ్రద్ధగా చదవండి.
⇒ 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి (నడవడం, నీళ్లు తాగడం).
⇒ ఇలా 4 సార్లు అయ్యాక, 15–30 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి.
⇒ ఇతర విషయాలను దూరం పెట్టండి. చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్‌లో పెట్టి మీకు దూరంగా ఉంచండి. సోషల్ మీడియా నోటిఫికేషన్ మీ సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి.
ఎలా చదవాలి?
ముందుగా మీ సిలబస్‌ను ఒక పేపర్‌పై రాసి, ఏఐ టూల్స్ సాయంతో టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. కళ్ల ముందు స్పష్టమైన ప్లాన్ ఉంటే అయోమయం పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే, ఏఐ టూల్స్ వాటంతటవే మీ కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి.
చదువును సులువు చేసే 4 ఏఐ టూల్స్
1. షోవెల్ యాప్ (స్టడీ ప్లానర్): మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్‌లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తుంది.
2. నోషన్ ఏఐ (ఆల్ ఇన్ వ¯న్ ఆర్గనైజర్): గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్‌ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ట్రాక్ చేయడానికి ఇది మంచి టూల్.
3. చాట్‌జీపీటీ (పర్సనల్ స్టడీ కోచ్): మీ అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తుంది. ఉదాహరణకు: ‘‘నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు’’అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది.
4. టుడూఇస్ట్ (స్మార్ట్ టాస్క్ మేనేజర్): ‘‘ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజూ సై¯న్స్ రివిజన్ చేయాలి’’అని మీరు సాధారణంగా టైప్ చేస్తే, ఈ ఏఐ వాటి డెడ్‌లై¯న్‌ను గుర్తించి క్యాలెండర్‌లో ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.


