నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్‌

Dry run for COVID-19 four states to start today - Sakshi

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో రెండు రోజులపాటు అమలు   

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకా పంపిణీకి  యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కానుంది. సన్నద్ధతలో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్‌ (డ్రై రన్‌)ను సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో 2 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డ్రై రన్‌లో పలు కీలక దశలు ఉంటాయి.  ళి ప్రతి జిల్లాలో 100 మందికి అవసరమైన డమ్మీ టీకాను సమీప డిపో నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తెస్తారు.

► వ్యాక్సిన్‌ తీసుకొనే వ్యక్తికి ఎస్‌ఎంఎస్‌ పంపిస్తారు. ఇందులో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం వంటి వివరాలుంటాయి.
► టీకా  తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది.
► సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే చికిత్స చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారు.

డ్రై రన్‌ అంటే?
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్‌ డ్రిల్‌ లాంటిదే.  టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top