కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం

DRDO Has Built Seven Storey Building In Record 45 Days - Sakshi

న్యూఢిల్లీ:   డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్   (డీఆర్‌డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది.  స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని  ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు.

ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్‌ అండ్‌ డెలవలప్‌మెంట్‌ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు డిఆర్‌డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్‌ ప్రోటెక్షన్‌ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు.

(చదవండి: ఇంతకీ ఐపీఎస్‌ అధికారి సూట్‌ కేస్‌లో ఏముందో తెలుసా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top