నాగ్‌పూర్‌కు చెందిన ఒక 72 ఏళ్ల పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) నర్సును సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో కొన్ని వారాల పాటు భయ భ్రాంతులకు గురిచేసి, రూ. 90.65 లక్షలు దోచుకున్నారు.
జిల్లాలోని జరిపట్కా నివాసి అయిన మహిళకు, గతేడాది నవంబర్‌లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారినంటూ ఓ వ్యక్తి కాల్ చేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులమంటూ ఆమెను నమ్మించారు. మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు బయటపడిందని, ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని బదిరించారు.
అంతేకాదు వీడియో కాల్స్ చేసిన అచ్చం పోలీస్ట్ స్టేషన్‌లా, నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ కోర్టు విచారణలను సృష్టించి బాధితురాల్ని మరింత భయపెట్టారు. మిమ్మల్ని 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని, ఎవరికీ చెప్పకూడదని బందీగా ఉంచారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 9 మధ్య వివిధ ఖాతాలకు రూ.90.65 లక్షలు బదిలీ చేయించారు. తమ విచారణలో ఆమె నిర్దోషిగా తేలితే డబ్బు వాపసు ఇస్తామని చెప్పిన దుండగులు.. తరువాత అన్ని రకాల కమ్యూనికేషన్స్ కట్ చేశారు. వారి ఫోన్లు స్విచ్చాఫ్ అవ్వడంతో తా తాను మోసపోయానని గ్రహించిన ఆమె ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, పోలీసులు, కోర్టులు, ఏజెన్సీలు ‘డిజిటల్ అరెస్టులు’నిర్వహించవని, డబ్బు బదిలీ చేయమని అడగవని తెలిపారు. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు, డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించారు.
నోట్ : సైబర్ నేరగాళ్లు సిబిఐ (CBI), ఈడీ (ED), పోలీస్ లేదా కస్టమ్స్ అధికారులలా నటిస్తూ బాధితులకు ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా భయపెట్టి, వారిని ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ల ముందే 'డిజిటల్ బందీలుగా' ఉంచుతారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చి దోచుకుంటారు.ఏ ప్రభుత్వ సంస్థ, కోర్టు లేదా పోలీస్ శాఖ కూడా ఇలా ఫోన్లలో 'డిజిటల్ అరెస్టులు' చేయవు. అలాగే దర్యాప్తు లేదా వెరిఫికేషన్ పేరుతో ప్రజల నుండి డబ్బులను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయమని ఎప్పటికీ అడగవు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలి.


