అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ

DGCA New Guidelines For Air Travel - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)తగు చర్యలు తీసుకుంటోంది. అందుకుగాను విమానంలో మాస్క్‌లు సరిగా ధరించకపోతే లేదా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు  ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని  ‘విధేయత లేని ప్రయాణీకులు' గా పరిగణిస్తామని డీజీసీఏ హెచ్చరించింది.

మార్చి 13న రిలీజ్‌ చేసిన ఒక ప్రకటనలో డీజీసీఏ , "విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు 'కోవిడ్ -19 ప్రోటోకాల్‌'లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన‍్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌లను కచ్చితంగా ధరించాల’ని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది.  ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. 

 విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్‌ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో  ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది. ఈ విషయాన్ని  వ్యక్తిగతంగా  భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్‌లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్ , టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు. ఒకవేళ, ఎవరైనా ప్రయాణీకులు "కోవిడ్ -19 ప్రోటోకాల్" ను ఉల్లంఘింస్తే హెచ్చరికలను జారీ చేయాలని,  తరువాత కూడా వినకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. (చదవండి: టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top