డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 ఖాళీలు

DFCCIL Recruitment 2021: Jr Executive, Executive Jr Manager Posts Check Details Here - Sakshi

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 1074
పోస్టుల వివరాలు: జూనియర్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌.

విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ తదితరాలు.

జూనియర్‌ మేనేజర్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌/కంట్రోల్‌/మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌),ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎంఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.50,000నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.

ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సప్లై/ఇండస్ట్రియల్‌/అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్‌/కమ్యూనికేషన్‌/డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ. 30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు. వయసు:18 నుంచి 30ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021
► వెబ్‌సైట్‌: https://dfccil.com/

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top