ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలు బంద్‌

Delhi air quality worsens to severe for first time this winter - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడంతో నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో శనివారం సాయంత్రం నాలుగింటికి 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ 397కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇంతగా గాలి కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సూక్ష్మ ధూళి కణాలు గాల్లో మరింతగా పెరగకుండా చూసేందుకు నిర్మాణ కార్యక్రమాలను ఆపాలని, కూల్చివేతలకు స్వస్తిపలకాలని కమిషనర్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌(సీఏక్యూఎం) శనివారం ఆదేశాలు జారీచేసింది.

దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులకు మినహాయింపునిచ్చింది. బీఎస్‌–3 పెట్రోల్, బీఎస్‌–4 డీజిల్‌ వాహనాల రాకపోకల నిషేధానికి నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. చలి పెరగడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. నిషేధకాలంలో బోర్లు వేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్, రోడ్ల నిర్మాణం, మరమత్తు, ఇటుకల తయారీ, తదితర నిర్మాణరంగ పనులను చేయకూడదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top