
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 60,405 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.