అలర్ట్‌ : కరోనాకు కాలుష్యం తోడైతే.. | Covid Crisis: Time For A Nationwide Ban On Crackers | Sakshi
Sakshi News home page

అలర్ట్‌ : కరోనాకు కాలుష్యం తోడైతే..

Nov 7 2020 11:06 AM | Updated on Nov 7 2020 1:04 PM

Covid Crisis: Time For A Nationwide Ban On Crackers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వచ్చిన ప్రతీసారి వాయు కాలుష్యం చర్చ పతాక శీర్శిక అవుతుంది. ఈసారి కాలుష్యానికి కరోనా తోడవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చలి, కాలుష్యం పెరగడం వల్ల కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. దేశమంతా కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి ఆందోళన చేందుతుంటే ఢిల్లీని మాత్రం థర్డవేవ్‌తో భయపెడుతోంది. ఇప్పటికే దీపావళి పటాకులపై ప్రభత్వం నిషేధం విధించింది. శీతాకాలం కావడంతో వైరస్‌లు విజృంభించే అవకాశం ఎక్కవగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు వివిధ రాష్ష్ర్టలు దీపావళికి టపాసులు కాల్చడంపై నిషేధం విధించగా, ఇంకొన్ని పరిమితులు విధించాయి. రాజస్తాన్‌, ఒడిశా, సిక్కిం, మహారాష్ష్ర్ట  మరికొన్ని తీసుకోనున్న జాగ్రత్తలు ప్రకటించాయి. హర్యానా, మధ్యప్రదేశ్‌ దిగుమతి చేసుకున్న బాణాసంచా కూడా పంపిణీ చేయెద్దని, వాడొద్దని పేర్కొంది. ఈ దీపావళిలో పటాకులను నిషేధించిన ఆరో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దేశం మొత్తం వీటిపై నిషేధం విధిస్తారా? లేక కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతుందా అనే చర్చ దేశ వ్యాప్తంగా సాగుతుంది.

కాలుష్య సెలవులు
ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం టోక్యో తర్వాత ఢిల్లీనే. దేశంలోని ముఖ్య నాయకులంతా ఈ నగరంలో జీవిస్తుంటారు. అయినప్పటికీ కాలుష్య నివారణ చర్యలు అత్యల్పం. ఇక్కడి స్కూల్లకు వేసవి సెలవులతో పాటు కాలుష్య సెలవులు కూడా ప్రకటిస్తుంటుంది ప్రభుత్వం. చలికాలం వస్తే చాలు ఢిల్లీని పొగ మేఘాలు కమ్మేస్థాయి. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యానికి తోడుగా, దీపావళి టపాసులు కాలుష్యాన్ని తారా స్థాయికి చేరుస్తాయి. రాజధాని చుట్టుపక్కలు గ్రామీణ ప్రాంతాల్లో తగలబెట్టిన వ్యవసాయ వ్యర్థాల నుంచి వెలువడే పొగ కూడా ఢిల్లీని కాలుష్య కోరల్లోకి నెట్టేస్తుంది. అగ్నికి వాయువు తోడైనట్టు కరోనాకు కనిష్ట ఉష్ణోగ్రత, వాయుకాలుష్యం తోడైతుంది.
 
ఆప్‌ ప్రతినిధి రీనా గుప్తా మాట్లాడుతూ.. ‘2కరోనా వైరస్‌ సంక్షోభం దారుణమైనది. వైరస్‌ మూడోదశ విజృంభనతో ఆందోళన కలిగిస్తోంది. దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం 100 శాతం పెరుగుతుంది. ప్రస్తుతానికి క్రాకర్స్‌ నిషేధించే నిర్ణయం 2020 కి మాత్రమే. దీపావళి దేశంలోనే పెద్ద పండుగ. వచ్చే ఏడాది పరిస్థితి బాగుంటుందని మేము ఆశిస్తున్నాం అన్నారు. క్రాకర్స్‌ పరిశ్రమ తనను తాను సంస్కరించుకోవాలి. అలాగే, ఒక సమాజంగా, మేము దీపావళిని జరుపుకునే మంచి మార్గాలను కనుగొనాలి’ సూచించారు.

పటాకులు పేల్చడం వల్ల కోవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నకు, మాక్స్‌ సూపర్‌ స్సెషాలిటీ హాస్సిటల్‌ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ వివేక్‌ సంగియా మాట్లాడుతూ.. ఫూల్జాది, అనార్‌, లాడి వంటివి ఎక్కువ కాలుష్యానికి కారణమైతాయి. ఇవి వైరస్‌ విస్తరించడానికి తోడ్పడుతాయన్నారు. దీపావళి ఎప్పుడూ దీపాల పండుగ. "ఇది ఇటీవలి కాలంలోనే టపాకాయల పండుగగా మారింది. మనము లేజర్ షోలు, గ్రీన్ క్రాకర్స్ వంటి ప్రత్యామ్నాయాలకు వెళ్ళాలి" అని ఆయన అన్నారు.

బాణసంచా సంఘం సీనియర్‌ కమిటీ సభ్యుడు వినోద్‌ టిక్మనీ మాట్లాడుతూ.. ‘సంవత్సరంలో రెండు గంటలు మాత్రమే పటాకులు కాలుస్తారు. పంట వ్యర్థాలు కాల్చడం, నిర్మాణ రంగం వంటి ఇతర అంశాలు ఎక్కువగా వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయని, వాయు కాలుష్యంలో క్రాకర్స్‌ పాత్ర తక్కువ అన్నారు. చివరి నిమిషంలో క్రాకర్స్‌ పై నిషేధం విధించడంతో మీము ఇబ్బందులకు గురైతున్నాము. మే-జూన్‌లోనే టపాకాయలు కోనుగోలు చేసి స్టాక్‌ పెట్టాము. ముందుగా సమాచారం అందిస్తే టపాకాయలు కొనేవారిమి కాదన్నారు. పర్యావరణ నిపుణుడు డాక్టర్‌ సంతోష్‌ హారీష్‌ కూడా వాయు కాలుష్యం నియంత్రనకు అన్ని అంశాలను పరిశీలించాల్సిన అవసరం’ ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement