
Delhi Covid Case Updates: దేశ రాజధానిలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆదేశించిన వారాంతపు కర్ఫ్యూలను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సిఫార్సు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఆయన కార్యాలయానికి పంపింది.
ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులకు ఆఫీస్‌లకు వెళ్లి 50 శాతం సామర్య్ధంతో పనిచేసేలా అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలో పేర్కొంది. అంతేగాక షాపులు తెరవడానికి ఇప్పటివరకు అమలులో ఉన్న సరి, భేసి సంఖ్య విధానం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో కేవలం అత్యవసర సేవల్లో పనిచేసే వారు, ఏదైనా అత్యవసరం అయిన వారు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఉండేది. కిరాణా, మందుల వంటి నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు మినహా అన్ని దుకాణాలు మూసివేశారు.
చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!
కాగా ఢిల్లీలో గురువారం 12,306 కొత్త కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. అయితే ముందు రోజుతో పోలిస్తే 10.72 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.గ్గుదల. అయితే, 43 మరణాలు ధృవీకరించబడ్డాయి - గత సంవత్సరం జూన్ నుండి అత్యధికంగా 44 మంది మరణించారు. ఇదిలా ఉండగా జనవరి 14న దాదాపు 30,000 గరిష్ట స్థాయి కేసులు వెలుగు చూడగా.. నిన్న 13,000 కంటే తక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం 70,000 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.