
ఆ బంగారు నగల దుకాణంలో వింత మోసం చోటుచేసుకుంది. కస్లమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయాన్న విషయాన్ని దుకాణం యజమాని చాలా ఆలస్యంగా గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌లోని ఒక నగల దుకాణంలో మోసం జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. బంగారు నగల దుకాణంలోనికి కస్టమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానికి ముందుగా రూ.1000 చెల్లించి, రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను ఎంచుకుని, కొద్దిసేపటి తరువాత వస్తామని చెప్పి దుకాణం నుంచి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం దాటినా వారు తిరిగి దుకాణానికి రాలేదు. దీంతో దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే అతను సీసీటీవీ ఫుటేజ్(CCTV footage)ను పరిశీంచి, దానిలోని దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనలో మోసపోయిన నగల దుకాణం యజమాని కృష్ణచంద్ర మాట్లాడుతూ తమ దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఒక పురుషుడు, ఒక మహిళ తనను బంగారు హారం, గొలుసు చూపించమని అడిగారన్నారు. వాటిని తాను చూపించాక వారు అడ్వాన్స్(Advance) గా వెయ్యి రూపాయలు చెల్లించి, పది నిముషాల్లో తిరిగి వచ్చి, మిగిలిన మొత్తం చెల్లించి, వస్తువులు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిద్దరూ సాయంత్రం దాటినా రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చి, దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారు రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయారని గుర్తించానన్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కృష్ణచంద్ర పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ