India Covid Cases: భారీగా పెరిగిన కేసులు.. నిన్నటితో పోలిస్తే 38% అధికం

Corona: India Report 12213 Cases In One day For 1st Time Since Feb - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసులు అమాంతం పెగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే 38% ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం దేశంలో నాలుగో వేవ్‌ ప్రారంభమైందా అనే అనుమానాలు రేకేత్తిస్తోంది.

పెరిగిన యాక్టివ్‌ కేసులు
భారత్‌లో ఇప్పటి వరకు 4,32,57,730 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం 11 మంది కోవిడ్‌ కారణంగా మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 5,24,803కు పెరిగింది. నిన్న ఒక్క రోజు 7,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4,26,74,712 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. యాక్టిక్‌ కేసుల సంఖ్య 58,215కు పెరిగింది. పాజిటివిటీ రేటు 2.35% శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది.

మహారాష్ట్ర టాప్‌
అత్యధికంగా మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ముంబైలోనే నిన్న రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. అయిదు నెలల తర్వాత అక్కడ ఇన్ని కేసులు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజు 1.21 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకు 195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
చదవండి: AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top