మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్‌ షాక్‌.. అందుకు నో!

Congress Rejects Uddhav Sena 23 Seat Demand in Maharashtra - Sakshi

ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్‌వర్గం) కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్‌ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 

కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్‌ నేత ఏక్‌ నాథ్‌ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 

రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్‌నాథ్‌ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్‌ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు.

 శివసేన, శరద్‌పవార్‌ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒక్కటే స్థిరమైన ఓట్‌షేర్‌తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top