Professor Lalan Kumar-Bihar: రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే!

College Professor Returns 33 Month Salary Rs 23 Lakh Bihar - Sakshi

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే పని చేసినా చేయకపోయినా సమయానికి జీతం తీసుకున్నామా, అందినంత వరకు సంపాదించుకున్నామా అన్నట్లు కొందరు ఉద్యోగులు ప్రవర్తిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఓ యూనివర్శిటీ మాష్టారు తన జీతం ఏకంగా రూ.23 లక్షలను తిరిగి తన పని చేసే కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్‌ నిర్ణయంతో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతంలోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్తల్లో నిలవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

ఈ విషయంపై లాలన్ ఏమంటున్నారంటే.. నితీశ్వర్ కళాశాలలో అతను చేస్తున్న టీచింగ్‌తో సంతృప్తిగా లేనని తెలిపారు. ఏ మాత్రం తీసుకుంటున్న చేస్తున్న పనికి సమతూకంగా లేదని తన మనస్సాక్షి చెప్పినట్టుగానే తనకు వచ్చిన 33 నెలల జీతాన్ని మొత్తం( రూ. 23 లక్షలు) పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్నాను అని అన్నారు. లాలన్‌ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే తానేందుకు జీతం తీసుకోవాలి. ఇక 25 సెప్టెంబర్ 2019 నుంచి కళాశాలలో పని చేస్తున్నాను.

అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు. తాను రిజిస్ట్రార్‌కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top