Chhattisgarh HC: భార్య ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం.. అత్యాచారం కాదు!

Chhattisgarh HC: Sexual Sexual Act Between Married Couple Not Marital Rape, Even If By Force - Sakshi

రాయపూర్‌: భార్య ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా భర్త బలవంతంగా భార్యతో సెక్స్‌లో పాల్గొంటే అది అత్యాచారం కిందకి రాదని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యతో శృంగారపరమైన చేష్టలు కూడా రేప్‌గా భావించలేమని స్పష్టం చేసింది. మారిటల్‌ రేప్‌ కింద అభియోగాలు ఎదుర్కొంటున్న సదరు భర్తని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఆ అభియోగాలను కొట్టేసిన కోర్టు అతను అసహజమైన పద్ధతుల్లో సెక్స్‌ చేస్తున్నాడంటూ ఐపీసీ సెక్షన్‌ 377 కింద నమోదైన అభియోగాలను సమరి్థంచింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ తన భర్త , అత్తమామలు తనని కట్నం కోసం వేధిస్తున్నారంటూ కేసు వేసింది.
చదవండి: భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం.. కోర్టు సంచలన తీర్పు

గృహహింస కేసుతో పాటు తాను ఎంత వ్యతిరేకిస్తున్నా వినిపించుకోకుండా అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తూ తనను హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కింద కోర్టులో అమెకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ భర్తపై అత్యాచారం కింద కేసు నమోదైంది. ఆ తీర్పుని సవాల్‌ చేస్తూ భర్త, అత్తమామలు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.కె. చంద్రవంశీ ‘‘భార్య వయసు 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం చేసినా, లైంగిక చేష్టలు చేసినా అది అత్యాచారం కాదు’’ అని తీర్పు చెప్పారు.
చదవండి: ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పుపై తాప్సీ అసహనం

వివాహబంధంతో ఒక్కటైన జంటలో భార్య గట్టిగా వ్యతిరేకించినా భర్త  శృంగారం చేస్తే దానిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆ భర్తపై మారిటల్‌ రేప్‌ అభియోగాలను కొట్టేశారు. అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తూ హింసిస్తున్నాడని సెక్షన్‌ 377 కింద నమోదైన అభియోగాలపై న్యాయమూర్తి విచారణ చేస్తూ.. వికృతమైన ఆనందం కోసం భార్యతో అసహజంగా శృంగారం చేస్తే అది నేరపూరిత చర్యేనని అన్నారు. భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం మారిటల్‌ రేప్‌ నేరం కాదు. కానీ ఇటీవల కొన్ని కోర్టులు ఈ అంశంలో భార్యలకు అనుకూలంగా తీర్పులివ్వడం మహిళాలోకానికి ఎంతో ఊరటనిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top