బిల్కిస్‌ బానో కేసు: దోషుల సత్ప్రవర్తన!! సీబీఐ, జడ్జి నో.. కేంద్రం మాత్రం రెండే వారాల్లో రిలీజ్‌కు పర్మిషన్‌

Centre Approved Bilkis Bano Rapists Release In 2 Weeks - Sakshi

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల ముందస్తు విడుదలకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదకొండు మంది ఖైదీల త్వరగతిన విడుదలను సీబీఐ, ప్రత్యేక న్యాయాస్థానాలు వ్యతిరేకించినా.. కేంద్రం కేవలం రెండే వారాల్లో విడుదలకు అనుమతి ఇచ్చిందని వెల్లడైంది. 

ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వం సోమవారం.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ ద్వారా ఈ విషయం వెల్లడైంది. పద్నాలుగేళ్లు జైల్లో గడిపిన బిల్కి బానోస్‌ నిందితులను సత్ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశామని, ఇందుకు కేంద్రం సైతం ఆమోదం తెలిపిందని గుజరాత్‌ ప్రభుత్వం, సుప్రీం కోర్టుకు నివేదించింది. రెమిషన్‌ కింద 11 మంది దోషులను విడుదల చేసేందుకు ఈ జూన్‌ 28వ తేదీన.. గుజరాత్‌ ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం ప్రయత్నించింది. అయితే జులై 11వ తేదీన కేంద్ర హోం వ్యవహారాల శాఖ దానికి అప్రూవల్‌ ఇచ్చినట్లు పత్రాల్లో స్పష్టంగా ఉంది. 

సీపీఎం పొలిబ్యూరో సభ్యులు సుభాషిని అలీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మెహువా మోయిత్రాలే కాకుండా మరొకరు కూడా బిల్కిస్‌ బానో దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1973లోని సెక్షన్‌ 435 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా గుజరాత్ ప్రభుత్వం మాత్రమే దోషులను విడుదల చేయడంపై పిటిషనర్‌ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దీంతో అత్యున్నత న్యాయస్థానం, గుజరాత్‌ ప్రభుత్వాన్ని  దోషుల రెమిషన్‌(విడుదలకు సంబంధించిన) ఆదేశాలతో సహా బిల్కిస్‌ బానో కేసుకు సంబంధించి మొత్తం రికార్డు ప్రొసీడింగ్స్‌ సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. ముంబైలోని సీబీఐ స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్పీతో పాటు గ్రేటర్‌ బాంబే సిటీ సివిల్‌ సెషన్స్‌ కోర్టు సీబీఐ ప్రత్యేక సివిల్‌ న్యాయమూర్తి సైతం ఖైదీల విడుదలను వ్యతిరేకించినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది గుజరాత్‌ ప్రభుత్వం. 

దోషుల క్షమాభిక్షకు సంబంధించిన నిర్ణయం గురించి తనను స్పందించలేదని బిల్కిస్‌ బానో చెప్తున్నారు. ఒక దోషులను విడుదల చేయాలని గుజరాత్‌ ప్రభుత్వం తరపున సూచించిన అడ్వైజరీ కమిటీ పది మంది సభ్యుల్లో.. సగం మంది బీజేపీతో సంబంధం ఉన్నారనే విషయం వెలుగు చూసింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. 

ఇదీ చదవండి: ముందు షారూక్‌ను తీసేయండి: బీజేపీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top