Vaccine: రక్త స్రావం, గడ్డకట్టడం భారత్‌లో చాలా తక్కువ

Bleeding And Clotting Events Post Covid Vaccination Minuscule in India - Sakshi

కోవిషీల్డ్‌ తీసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే ఈ సమస్య

ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏఈఎఫ్‌ఐ

న్యూఢిల్లీ: భార‌త్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనికా త‌యారు చేసిన టీకాల‌ను.. ఇండియాలో సీరం సంస్థ కోవిషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వ‌ల్ల .. కొంద‌రిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్లు ఇటీవ‌ల కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. 

యూరోప్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తిన కేసులు 20 వ‌ర‌కు న‌మోదు అయిన‌ట్లు రికార్డులు తెలిపాయి. కరోనా టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్‌లో అత్యంత తక్కువ అని నేషనల్‌ ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం నివేదిక సమర్పించింది.

ఏప్రిల్ 3వ తేదీ వ‌ర‌కు ఇండియాలో 75,435,381 మందికి వ్యాక్సిన్లు ఇచ్చార‌ని, దాంట్లో కోవీషీల్డ్ 650,819 మందికి, కోవాగ్జిన్ టీకాల‌ను 6,784,819 మందికి ఇచ్చిన‌ట్లు నేష‌న‌ల్ ఏఈఎఫ్ఐ తెలిపింది. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ చేప‌ట్టి త‌ర్వాత 23 వేల స‌మ‌స్యాత్మ‌క కేసుల‌ను గుర్తించిన‌ట్లు.. కోవిడ్‌ పోర్టల్‌ ద్వారా దీని గురించి తెలిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక వీటిలో కేవ‌లం 700 కేసులు మాత్ర‌మే సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. అంటే ప‌ది ల‌క్ష‌ల్లో 9.3 కేసులు మాత్రమే స‌మ‌స్యాత్మ‌కం అని గుర్తించిన‌ట్లు క‌మిటీ చెప్పింది.

సుమారు 498 సీరియ‌స్ కేసుల‌ను క‌మిటీ లోతుగా అధ్య‌య‌నం చేసింది. దాంట్లో 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్లు గుర్తించారు. కోవిషీల్డ్ తీసుకున్న‌వారిలో త్రాంబోఎంబోలిక్ కేసులు 0.61గా ఉన్న‌ట్లు క‌మిటీ స్ప‌ష్టం చేసింది. ఇక కోవాగ్జిన్ టీకా తీసుకున్న‌వారిలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన కేసులేవీ న‌మోదు కాలేద‌న్న‌ది.

ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే కేసులు ఇండియాలో అతి స్వ‌ల్పంగా న‌మోదు అయిన‌ట్లు ఏఈఎఫ్ఐ వెల్ల‌డించింది. అది కేవ‌లం 0.61గా ఉన్న‌ట్లు చెప్పింది. దిలావుంటే, బ్రిటన్‌లో ఇది ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులు, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు కేవలం 10 కేసులు నమోదయినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది. ‘‘నేపథ్యం, శాస్త్రీయ కారణాలను పరిగణనలోకి తీసుకుంటే యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ, ఆగ్నేయాసియా సంతతికి ఈ ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని సూచిస్తుంది’’ అని నివేదిక తెలిపింది.

రక్తం గడ్డకట్టడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాక్సిన్‌ భయాలను తొలగించాలని అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు, గుండెల్లో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలను పరిశీలించాలని తెలిపింది. గత నెలలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు.

ఇదిలావుంటే, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఎదురుకావడంతో డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కోవిషీల్డ్‌ను నిషేధించాయి. దీనిపై ఐరోపా సమాఖ్య మెడికల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి కోవిషీల్డ్ సురక్షితమైందేనని, ప్రభావంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.

చదవండి: Corona Vaccine: కోవాగ్జిన్‌ స్టాక్‌ లేదు.. కోవిషీల్డ్‌కు అర్హులు లేరు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 19:35 IST
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
17-05-2021
May 17, 2021, 18:21 IST
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది....
17-05-2021
May 17, 2021, 16:50 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18,561 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,54,052...
17-05-2021
May 17, 2021, 16:20 IST
చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గొప్ప మనసు చాటుకున్నారు. కోవిడ్‌-19పై పోరులో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు...
17-05-2021
May 17, 2021, 16:06 IST
సాక్షి, విజయవాడ: కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...
17-05-2021
May 17, 2021, 15:57 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడంలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం...
17-05-2021
May 17, 2021, 15:49 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్‌...
17-05-2021
May 17, 2021, 15:25 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి....
17-05-2021
May 17, 2021, 14:28 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం డీఆర్‌డీఓ, డాక్టర్‌ రెడ్డీస్‌ సంయుక్తంగా 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ (2–డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ది...
17-05-2021
May 17, 2021, 12:59 IST
నటుడు శివకార్తికేయన్‌ రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. ఎడిటర్‌ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం...
17-05-2021
May 17, 2021, 12:26 IST
కోవిడ్‌ ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరిస్తోంది. సినీ రంగానికి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడి కన్నుమూశారు. మరికొందరు...
17-05-2021
May 17, 2021, 11:33 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్‌ తప్పుకున్నారు. కోవిడ్ రెండో...
17-05-2021
May 17, 2021, 11:04 IST
సాక్షి, హైదరాబాద్‌: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు...
17-05-2021
May 17, 2021, 10:38 IST
సాక్షి, ఖమ్మం: కరోనా సోకిన వారు అనవసర ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండి.. వైద్యులు సూచించిన మందులు వాడడం ద్వారా...
17-05-2021
May 17, 2021, 09:27 IST
హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా...
17-05-2021
May 17, 2021, 09:13 IST
నల్లగొండటౌన్‌ : కరోనా వైరస్‌ మరింత శక్తివంతంగా మారుతోంది. మొదటి దశలో కంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల...
17-05-2021
May 17, 2021, 08:43 IST
గీసుకొండ : గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం...
17-05-2021
May 17, 2021, 08:00 IST
ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..?...
17-05-2021
May 17, 2021, 06:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా గణాంకాలు ఊరటనిస్తున్నాయి. ఇంకా రోజుకు మూడు లక్షలకు పైనే కేసులు వస్తున్నప్పటికీ... మొత్తం మీద చూస్తే...
17-05-2021
May 17, 2021, 06:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top