అస్సాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల | BJP unveils Assam manifesto promises protection of indigenous people | Sakshi
Sakshi News home page

అస్సాంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

Apr 1 2026 11:20 AM | Updated on Apr 1 2026 12:15 PM

BJP unveils Assam manifesto promises protection of indigenous people

అస్సాంలో తమను గెలిపిస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ పేర్కొంది. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్ర మించిన భూములను విడిపించి స్థానికులకు అందజేస్తాం. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తాం’’అని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 31 హామీలతో కూడిన బీజేపీ ‘సంకల్పపత్ర’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం గువాహటిలో విడుదల చేశారు. ఇక అస్సాంలో ఏప్రిల్‌ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..

  • అరుణోదయ్‌ పథకం లబ్ధిదారులైన మహిళలకు ఆర్థిక సాయం ప్రస్తుత రూ.1,250 నుంచి క్రమంగా రూ.3,000కు పెంపు

  • గిరిజనులతో సహా అర్హులైన తేయాకు కార్మికులందరికీ భూ పట్టాలు. రూ.500 చొప్పున వేతన పెంపు.   

  • అక్రమ చొరబాటుదారులకు దేశ బహిష్కరణ 

  • ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుతో అస్సామీల నాగరికత, వారసత్వం, హక్కుల పరిరక్షణ 

  • మిషన్‌ వసుంధర’లో భాగంగా చొరబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రతి అంగుళం భూమికీ విముక్తి. వాటిపై అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు.

చదవండి: బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్‌, ఉచిత సిలిండర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement