అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్‌ | Bihar government suspends two senior IAS officers | Sakshi
Sakshi News home page

అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్‌

May 31 2026 1:14 AM | Updated on May 31 2026 1:14 AM

Bihar government suspends two senior IAS officers

పట్నా: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను శనివారం బిహార్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), స్పెషల్‌ విజిలెన్స్‌ యూనిట్‌ (ఎస్‌వీయూ)ల నుంచి వచ్చిన సిఫారసుల మేరకు నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. వీరిలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 2017 బ్యాచ్‌కు చెందిన యోగేశ్‌ కుమార్‌ సాగర్‌ కాగా, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే 2014 బ్యాచ్‌ అధికారిణి అభిలాష కుమారి శర్మ అని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. సస్పెన్షన్‌ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement