AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా? | Bengaluru Veg Sellers Use AI for Rs 350 per Hour Extra Income | Sakshi
Sakshi News home page

AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?

May 21 2026 4:19 PM | Updated on May 21 2026 5:23 PM

Bengaluru Veg Sellers Use AI for Rs 350 per Hour Extra Income

సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్‌గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ వైభవ్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు.

‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్‌ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్‌తో హెడ్‌బ్యాండ్‌తో డేటా కలెక్ట్‌ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్‌ టైం డేటా కలెక్ట్‌ చేసేలా ఏఐ డేటా కలెక్షన్‌ హెడ్‌ గేర్‌ను ధరించాడు. హెడ్‌గేర్‌ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్‌గేర్‌ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.

అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్‌ గేర్‌ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్‌ టైం డేటాతో సరిపోల్చి యూజర్‌కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.  

ఏఐ డేటా గేర్‌ కనెక్షన్‌ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్‌ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్‌బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్‌. ఈ గేర్‌ను కంపెనీలు గిగ్‌ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement