Maharashtra: ‘హాట్‌ స్పాట్‌’ వివాదం.. బ్యాంక్‌ మేనేజర్‌ హత్య | Bank Manager Murdered over Mobile hot Spot Dispute | Sakshi
Sakshi News home page

Maharashtra: ‘హాట్‌ స్పాట్‌’ వివాదం.. బ్యాంక్‌ మేనేజర్‌ హత్య

Sep 3 2024 11:32 AM | Updated on Sep 3 2024 1:20 PM

Bank Manager Murdered over Mobile hot Spot Dispute

పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ హత్య  చోటుచేసుకుంది. మొబైల్ హాట్ స్పాట్ ఇచ్చే విషయంలో వివాదం చోటుచేసుకుని అది బ్యాంక్ మేనేజర్ హత్యకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాసుదేవ్ రామచంద్ర కులకర్ణి(47)ని నలుగురు కుర్రాళ్లు హత్య చేశారు. కులకర్ణి తన ఇంటి దగ్గర వాకింగ్‌కు వెళుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు  కులకర్ణిని మొబైల్ హాట్‌స్పాట్ ఆన్‌ చేయాలని అడిగారు. ఆయన అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఆగ్రహంతో ఆ యువకులు బ్యాంక్ మేనేజర్‌పై దాడిచేసి హత్య చేశారు. ఈ ఉందంతంలో నిందితులును పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement