
కువైట్: దాయాది దేశం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మున్సీర్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. కాపీ కొట్టడానికి అర్హత లేని స్టుపిడ్ జోకర్స్ అన్న ఒవైసీ.. పాక్ ఆర్మీ చీఫ్ ఫేక్ మెమెంటో అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కువైట్‌లో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కువైట్‌లో ఆయ న మాట్లాడుతూ.. పాక్ ఫేక్ ప్రచారాన్ని ఎండగట్టారు. పాక్ చెప్పేవనీ అబద్ధాలే.. వారి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని ఒవైసీ అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అసత్య ప్రచార డోసు మరీ శ్రుతిమించి నవ్వులపాలవుతోంది. ఇటీవల ఉద్రిక్తతల సమయంలో భారత్‌పైకి తాము జరిపిన భీకర దాడులకు సాక్ష్యమంటూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు బహుమతిగా అందజేసిన ఫొటోను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆపరేషన్ ‘బున్యన్ అల్–మర్సుస్’తో భారత్‌పై సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఇటీవల ప్రభుత్వ పెద్దలు, ఆర్మీ అధికారులతో ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హై ప్రొఫైల్ సమావేశం ఏర్పాటు చేశారు.

రాజకీయ నాయకత్వం గొప్పదనం, సైనిక బలగాల చెక్కు చెదరని నిబద్ధతను చాటేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రంలో ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధాని షెహబాజ్‌కు ‘భారత్‌పై దాడులకు ప్రతీక’అంటూ ఒక భారీ చిత్రపటాన్ని కానుకగా అందజేశారు. ఈ ఫొటోనే మునీర్ దుష్ప్రచారాన్ని మరోసారి బట్టబయలు చేసింది. వాస్తవానికి ఈ ఫొటో 2019లో చైనా ఫొటోగ్రాఫర్ హువాంగ్ హై తీశారు. అది చైనా రూపకల్పన చేసిన పీహెచ్‌ఎల్–03 రకం బహుళ రాకెట్ లాంఛర్ల వ్యవస్థకు సంబంధించిన పాత ఫొటో.
No one does it better than Owaisi, as he exposes and shames Pakistan.
Pakistan's very new self-proclaimed Field Marshal Asim Munir gifted a momento to Pakistan PM Shahbaz Sharif claiming victory against India in the recent India-Pakistan conflict.
Listen to Asaduddin Owaisi:… pic.twitter.com/ph2TpOQJuf— IndianArmy in Jammu & Kashmir (Fan Page) (@IndianArmyinJK) May 27, 2025