అర్నాబ్‌కి బెయిల్‌ మంజూరు

Arnab Goswami Granted Interim Bail By Supreme Court - Sakshi

మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి మధ్యంతర బెయిల్‌ మంజూరు అయింది. అర్నాబ్‌తో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. 
(చదవండి : అర్నబ్‌ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు)

 కాగా, ఈ కేసులో  గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను  బాంబే హైకోర్టు  తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అర్నాబ్‌ సుప్రీం కోర్టు తపులు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్‌ గోస్వామి వాదన.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top