దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన ఏపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి | AP Ministers Buggana Peddireddy Attended Southern Zonal Council Meet in Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన ఏపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి

Published Sat, Sep 3 2022 2:01 PM | Last Updated on Sat, Sep 3 2022 2:27 PM

AP Ministers Buggana Peddireddy Attended Southern Zonal Council Meet in Thiruvananthapuram - Sakshi

సాక్షి, తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. 

ఈ సమావేశానికి  ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్‌, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి సైతం ప్రస్తావించారు.

మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్‌ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
చదవండి: పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement