ఆనంద్‌ మహీంద్ర: ‘‘చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’

Anand Mahindra Shared Has A Message For People About Old Days - Sakshi

ముంబై: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ వివిధ విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా చాలానే ఉంటాయి. తాజాగా ఆయన గడిచిపోయిన కాలానికి సంబంధించిన  ఒక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ మనం నిజంగా ఒకరిని కించపచకుండా ఉండే రోజులను కోల్పోతున్నాం. ప్రస్తుత కాలంతో పోలిస్తే చాలా మంది పాత రోజులనే ఇష్టపడుతున్నారు’’ అంటూ జెర్రీ కార్టూన్‌ షేర్‌ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో చేరాలా..వద్దా ఆలోచించడం లేదు. తమ అభిప్రాయాలు పంచుకున్న వారిని దూషించే కామెంట్స్‌ చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు.  మే11న షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ని 9,300 మంది నెటిజన్లు లైక్‌ కొట్టగా..వేల మంది కామెంట్స్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది నెటిజన్లు తమ ఆలోచనలను అక్కడ కామెంట్స్‌ రూపంలో పంచుకుంటున్నారు. 

 నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ఈ సంక్లిష్ట సమయాల్లో ధ్యానం చేయడం బాగా పనిచేస్తుంది’’ అని ట్వీట్‌ చేయగా.. ‘‘ఈ రోజుల్లో మన అభిప్రాయాలను పంచుకోవడం సమస్యలను సృష్టిస్తుంది. దానికంటే మాట్లాకపోవడం ఉత్తమం.’’ అదే ఆనందంగా ఉంచుతుంది.’’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో నెటిజన్‌ ‘‘ప్రస్తుతం తుమ్మినా..అనుమానించాల్సి వస్తుంది’’ అని చమత్కరిస్తే.. కొన్నిసార్లు సోషల్‌ మీడియా ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఆయుధంగా మారింది.’’ అంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

(చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి‌.. చిన్నారికి చెప్పేదెలా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top