గంజాయి ఆరోపణలు.. వీడియోగ్రాఫర్‌ ఆత్మహత్య  | Allegations Marijuana Photographer Commits Suicide Mysore | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం వెళ్తే గంజాయి ఆరోపణలు.. ఎన్ని కష్టాలొచ్చిన భరించా.. కానీ!

Jan 20 2023 8:38 AM | Updated on Jan 20 2023 8:45 AM

Allegations Marijuana Photographer Commits Suicide Mysore - Sakshi

సాక్షి, బెంగళూరు: యువకుడిపై గంజాయి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై డెత్‌నోటు రాసి పెట్టి ఉరి వేసుకొన్నాడు. మృతుడు అభిషేక్‌ (23) వీడియోగ్రాపర్‌గా పనిచేసేవాడు.  స్నేహితునికి ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవాలని అభిషేక్‌ అక్కడికి వెళ్ళిన సమయంలో కొందరు గంజాయి తాగుతుండగా పోలీసులు వచ్చి అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నీవు కూడ గంజాయి తాగుతావా అని అభిషేక్‌ని ప్రశ్నించారు. తాగలేదని చెప్పడంతో ఇంటికి పంపించారు.

విచారణకు అవసరమైతే మళ్లీ రావాలని సూచించారు.  ఈ సంఘటనతో తీవ్రంగా మథనపడ్డాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కానీ ఇలాంటి ఆరోపణలు రావడం భయంగా ఉందని, ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించానని, కానీ ఎలాంటి తప్పు చేయకున్నా గంజాయి తాగినట్లు పట్టుకుని వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ మేరకు సుసైడ్‌ లెటర్‌ రాసి ఉరి చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అశోకపురం పోలీసులు పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement