వారిని వదిలిపెట్టం, ఆత్మాహుతి దాడులు చేస్తాం.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన అల్‌కాయిదా

Al Qaeda Threatens Suicide Attack To India Over Comments On Prophet - Sakshi

న్యూఢిల్లీ: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతపు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాల జాబితాలోకి తాజాగా ఉగ్ర సంస్థ ఆల్‌కాయిదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. అందుకు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్లు  ఆల్‌కాయిదా హెచ్చరికలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్‌ ఇచ్చింది.

ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్‌ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్‌ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ  టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పోలంలో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top