నారాయణపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్–మీడియా సమన్వయం కీలకమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని శాసన్‌పల్లి రోడ్‌లో ఉన్న ఓ బ్యాంకెట్ హాల్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్–ప్రెస్ గెట్ టు గెదర్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించాల్సిన సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలను మీడియా ప్రజల దృష్టికి తీసుకెళ్తోందని పేర్కొన్నా రు. పోలీసుశాఖ విధుల్లో ఎదురయ్యే సమస్యలు, లోపాలను మీడియా నిర్మాణాత్మకంగా సూచిస్తే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే పోలీసుశాఖ లక్ష్యమని, ఇందుకు మీడియా సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలంటే పోలీసులపై విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, మీడి యా ప్రతినిధులు ప్రజలకు సేవలందించేందుకు ముందుండి పనిచేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో మీడియా సేవలను సైతం అత్యవసర సేవల్లో భాగంగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాలో ఏడాది కాలంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ఎస్పీ అభినందించారు. పోలీసుశాఖ సాధించిన విజయాలు ఏ ఒక్కరి కృషి ఫలితం కాదని, ప్రతి అధికారి, సిబ్బంది సమష్టి కృషితోనే సాధ్యమవుతున్నాయని తెలి పారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. పోలీసుశాఖకు మీడియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ.. భవిష్యత్‌లో నూ ఇదే సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, డీపీఆర్వో రషీద్, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.


