బోధనలో సాంకేతికతను వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

బోధనలో సాంకేతికతను వినియోగించాలి

Oct 9 2026 2:20 AM | Updated on Oct 9 2026 2:20 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: బోధనలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో తెలంగాణ విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్టీ సంయుక్తంగా రూపొందించిన ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లర్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే జిల్లాలోని 140 మంది భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుత విద్యా విధానంలో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం ఎంతో కీలకమని.. ఉపాధ్యాయులు డిజిటల్‌ సాధనాలు, డిజిటల్‌ కంటెంట్‌ను విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపర్చే సమర్థవంతమైన సాధనాలుగా వినియోగించాలన్నారు. అదేవిధంగా కోడింగ్‌, డాటా సైన్స్‌, గేమింగ్‌, స్టేమ్‌ వంటి అంశాలను ఉపాధ్యాయులు స్వయంగా నేర్చుకొని వాటిని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా తరగతిగదిలో బోధనలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్‌, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌, మధ్యాహ్న భోజన సమన్వయకర్త యాదయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement