నారాయణపేట: రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్‌ఎంజీఈ ఇంటర్న్‌లకు తొమ్మిది నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చే శారు. ఐఎంజీ ఇంటర్న్‌లతో సమానంగా వార్డు లు, అత్యవసర విభాగాలు, రోగుల సంరక్షణ, 24 గంటల డ్యూటీలు నిర్వహిస్తున్నా.. స్టైఫండ్ విషయంలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పని చేస్తున్నప్పుడు సమాన స్టైఫండ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం నెలకు రూ.29,972 చొప్పున తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పల్లీ క్వింటా రూ.7,031
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 67 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,031, కనిష్టంగా రూ. 5,796, సరాసరి రూ. 6,279 ధరలు లభించా యి. అలాగే 37 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 7,359, కనిష్టం రూ. 7,259, సరాసరి రూ. 7,319 ధరలు పలికాయి.


