నారాయణపేట: సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు, ఆన్‌లైన్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలి పారు. ఆన్‌లైన్ పెట్టుబడుల్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టిస్తారన్నారు. ఆ తర్వాత ట్యాక్స్, జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరింత డబ్బు వసూలు చేసి, చివరకు ఖాతాలను బ్లాక్ చేస్తా రని పేర్కొన్నారు. టాస్క్ లు, రివ్యూలు, రేటింగ్‌లు, పార్ట్‌టైమ్ ఉద్యో గాల పేరుతో తొలుత చిన్న మొత్తంలో రాబడి చూపించి.. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడు లు పెట్టాలని ఒత్తిడి చేస్తారన్నారు. ఉద్యోగం లేదా ఆన్‌లైన్ వర్క్ కోసం ముందుగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీ సులు, సీబీఐ, కస్టమ్స్ తదితర దర్యాప్తు సంస్థల అధికారులుగా పరిచయం చేసుకుని వీడి యో కాల్స్‌లో బెదిరించడం పూర్తిగా మోస మని ఎస్పీ స్పష్టం చేశారు. ‘డిజిటల్ అరెస్ట్ చే శాం.. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలి’ అంటూ బెదిరించినా నమ్మవద్దని సూచించారు. బ్యాంకు, పోలీసు అధికారుల పేరుతో ఫోన్ చేసినా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించొద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేయడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.


