ఫుట్‌బాల్‌ రన్నరప్‌గా నారాయణపేట | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ రన్నరప్‌గా నారాయణపేట

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ బాలుర ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. ఈపోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి ఐదు జట్లు పాల్గొనగా లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జట్టు విన్నర్‌గా, నారాయణపేట జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఆడి జాతీయస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్‌, సభ్యులు గజానంద్‌కుమార్‌, నందకిషోర్‌, ఇమ్మాన్యుయేల్‌ జేమ్స్‌, పీడీలు రామకృష్ణ, రాజు, నాగరాజు, చంద్రశేఖర్‌, రాంమోహన్‌గౌడ్‌, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement