‘సూర్యఘర్‌’తో విద్యుత్‌ బిల్లులు తగ్గించుకోండి | - | Sakshi
Sakshi News home page

‘సూర్యఘర్‌’తో విద్యుత్‌ బిల్లులు తగ్గించుకోండి

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

నారాయణపేట: పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ నవీన్‌కుమార్‌ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విద్యుత్‌ అధికారులు, వినియోగదారులకు పీఎం సూర్యఘర్‌ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఇంటి అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకోవడంతో పాటు ఖర్చులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ ఎలా ఉత్పత్తి అవుతుంది.. దాన్ని ఎలా వినియోగించుకోవాలి.. పథకం నిబంధనలు ఏమిటి.. వెండర్ల ద్వారా సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే విద్యుత్‌ సరఫరా సమయంలో విద్యార్థులు, ప్రజలు తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ వినియోగం విస్తరించేలా ప్రజలు పథకంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్ర మంలో డీఈటీ రాజునాయక్‌, ఆపరేషన్‌ డీఈ శ్రీని వాస్‌, ఏఈటీ వెంకటకృష్ణారెడ్డి, ఎల్‌ఐ యాషిన్‌ పా షా,ఆర్టిజన్‌ నర్సింహారావు, తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement